ఫామిలీ ముందు ఆ ఇద్దరు లవర్స్ ని బుక్ చేసాడు ట్రాఫిక్ పోలీస్.! తర్వాత ఏమైందో తెలుసా.?  

కానీ మూర్తిని మాత్రం పట్టుకున్నారు పోలీసులు.. ఎంటండీ..! నా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టు గానే ఉన్నాయ్..లైసెన్స్ కూడా ఉంది..అయినా ఎందుకు పట్టుకున్నారని పోలీసులతో గొడవకు దిగాడు మూర్తి. అన్నీ ఓకే కానీ మీ బైక్ మీద మూడు చలాన్లున్నాయ్ అవి కట్టలేదంటూ డీటేల్స్ చూపించాడు పోలీస్ లింగమూర్తికి…

లింగమూర్తితో పాటు…. అతని ఫ్రెండ్స్ కూడా ఎక్కడెక్కడ సిగ్నల్ జంప్ అయ్యారో పోలీస్ చూపిస్తున్న సిస్టమ్ లో చూస్తున్నారు. ఒకటి నెక్లెస్ రోడ్ దగ్గర రాంగ్ పార్కింగ్. రెండు హైటెక్ సిటీ దగ్గర సిగ్నల్ జంప్.. మూడు కోఠి దగ్గర రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఆ ఫోటోలను చూసిన లింగమూర్తి మరియు అతని ఫ్రెండ్స్ అశ్చర్యపోయారు.

మొదటిది మనోజ్, మరో అమ్మాయి… నో పార్కింగ్ దగ్గర బండి ఆపి ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్న ఫోటో. రెండో ఫోటో….. మనోజ్ డ్రైవింగ్ మరో అమ్మాయి వెనుకనుండి మనోజ్ ను హట్టిగా హత్తుకుంది. సిగ్నల్ జంప్. మూడో ఫోటో…. మనోజే , రాంగ్ సైడ్ డ్రైవింగ్. సేమ్ అదే అమ్మాయి వెనుక ఉంది…ఈ ఫోటోలో ఇంకా గట్టిగా హత్తుకొని ఉంది ఆ అమ్మాయి మనోజ్ ను. చలాన్ల కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీలో లింగమూర్తి ఫ్రెండ్స్…అరెయ్…. లింగం, అబ్బాయ్ అమ్మాయి ఈడూజోడూ చాలా బాగుంది. వాళ్లు కూడా చాలా దగ్గర అయిపోయారు కదరా.. ఓకే చేసేయ్ అన్నారు. మా వాడు ఇంత ముదురు అనుకోలేదురోయ్ అంటూ కొడుకు మీదే జోక్ పేల్చాడు లింగమూర్తి. ఇంటికెళ్లగానే మనోజ్ ను ఆరా తీయడం. మ్యారేజ్ ఓకే చేయడం. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయడం చకాచకా జరిగిపోయాయ్.

వారం రోజుల తర్వాత మనోజ్, మమత స్వీట్ బాక్స్ ను తీసుకెళ్లి ఆ పోలీస్ చేతిలో పెట్టి ఆశీర్వాదం కోరారు.