బిగ్ బాస్ 2 అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు..! లైఫ్ గురించి ఈ విషయాలు కూడా నేర్చుకోవచ్చు.!     2018-06-17   23:24:13  IST  Raghu V

11 మంది మైదానంలో ఆడే క్రికెట్ ఆటని చూసి జీవితానికి పనికొచ్చేది నేర్చుకునేదానికన్నా 16 మంది బిగ్ బాస్ హౌసులో ప్రవర్తించే తీరుని చూసి ఎక్కువ నేర్చుకోవచ్చు. ఎలా ఉంటే అందరికీ నచ్చుతాం, ఎలా ఉండడం వల్ల నచ్చము, ఏం చేయకుండా ఉంటే సహజంగా కనపడతాం, ఏం చేస్తే నటిస్తున్నట్టు తెలిసిపోతాం…ఇలా ఎన్నో నేర్చుకోవచ్చు.

తొలివారం ముగిసేసరికి సంజన ఎలిమినేట్ అయ్యారు. అది అందరూ ఊహించినదే, చాలామంది ఆశించినదే. ఆమెకి ఓడినా జనం మనసుని గెలిచే ఆఖరి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆమె ఆ నాలుగు నిమిషాలు తన ఒరిజినాలిటీని పక్కనపెట్టి నటించి ఉంటే సరిపోయేది. చివరకి వెళిపోయేటప్పుడు కూడా ఆమె తన ఒరిజినాలిటీని దాచలేకపోయింది. ఆటని ఆటగా తీసుకోకుండా బయటికొచ్చికూడా తనకి నచ్చని వాళ్లకి కటవుగా క్లాసు పీకింది.

ఇక మిగిలినవారిని చూస్తుంటే…

* నూతన్ నాయుడు మేకప్పేసి తన ఒరిజినాలిటీని దాస్తున్నట్టు..
* కిరీటి మాట్లాడితేనే మార్కులొస్తాయని ఎక్కువ మాట్లాడుతున్నట్టు…
* గణేష్ తన అమాయకపు నవ్వులతో ఏం చెయ్యాలో తెలియక చోద్యం చూస్తున్నట్టు…
* కౌశల్ టి.ఆర్.పి కి రొమాన్సే కరెక్ట్ అని భావించి తన రొమాంటిక్ యాంగిల్ చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు…