Facts About Pilli Shakunam

శుభకార్యాలకు వెళుతున్నప్పుడు పిల్లి అడ్డం వస్తే మన పెద్దవారు చేసే హడావిడిని మనం చూస్తూనే ఉంటాం. పిల్లి అడ్డు రాగానే వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అసలు పిల్లి ఎదురు పడితే ఏమవుతుంది. పిల్లి ఎదురు పడే శకునం వెనక ఏ ఉద్దేశం ఉందో తెలుసుకుందాం.

పూర్వకాలంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే ఎడ్ల బండి మీద వెళ్లేవారు. ఆలా వెళ్ళటం వలన ప్రయాణం కూడా బాగా ఆలస్యం అయ్యేది. అలాగే మధ్య దారిలో అడవులు ఉండేవి. చీకటి కూడా పడేది. ఆ చీకటి సమయంలో పిల్లి జాతికి చెందిన పులి,సింహాలు ఎదురు పడేవి. వాటిని చూసి ఎడ్లు ముందుకు వెళ్లకుండా ఆగిపోయేవి. దాంతో కాలక్రమేణా ఆ జాతి జంతువులు ఎదురు పడితే అపశకునంగా భావించటం ప్రారంభం అయింది.

మన భారతదేశంలో పిల్లి శకునాన్ని పాటిస్తారు. అదే కొన్ని దేశాలలో అయితే పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకొంటారు.