రాత్రి 10 తర్వాత ఫేస్ బుక్ వాడితే ఇక అంతే..! తప్పక తెలుసుకోండి.! అందరికి షేర్ చేయండి!     2018-05-20   23:48:32  IST  Raghu V

సోషల్ మీడియా వాడే వారే. అంతగా అడిక్ట్ అయిపోయాం మనం. ప్రతి విషయాన్ని నేరుగా కాకుండా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు. సామాజిక మాధ్యమాల్లో ‘బిజీ’గా ఉంటూ నిద్రాహారాలు మరిచిపోయేవారే ఎక్కువవుతున్నారు. అయితే రాత్రి, పగలూ తేడా లేకుండా సోషల్‌ మీడియాలో మునిగిపోయే వారికి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని తాజాగా ఓ సర్వే బయట పెట్టింది.

రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్‌ మీడియాలో గడపటం, టీవీ చూడటం వంటి అలవాట్లున్న వారు తీవ్రమైన ఒత్తిడి, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు గురికాక తప్పదని ‘ది లాన్సెట్‌ సైకియాట్రీ జర్నల్‌’లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. కోపం, బాధ, చిరాకు వంటివి వారిలో తీవ్రమవుతాయని రిపోర్టు పేర్కొంది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో వారు నరాల వ్యాధులకు కూడా గురికావొచ్చని నివేదిక హెచ్చరించింది. అంతేకాకుండా బాగా పొద్దు పొయాక నిద్ర పోయేవారు ఆనందంగా ఉండలేరని, ఎప్పుడూ ఒంటరి తనంతో బాధ పడుతుంటారని ఈ రిపోర్టు స్పష్టం చేసింది.