పొలిటికల్ లీడర్స్ కి షాక్ ఇస్తున్న పేస్ బుక్    2017-10-30   04:52:23  IST 

పేస్ బుక్ ఇప్పుడు ఒక సంచలనం..ఎవరికీ నచ్చినట్టుగా వారి వారి మనోభావాలని సోషల్ మీడియా ద్వారా పంపవచ్చు..ఇదే చాలా మందికి పెద్ద వేదికలా అయ్యింది..ఉద్యమాలని సైతం సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ ద్వారా కొన్ని కోట్ల మందికి తెలియచేసి ఫేమస్ అవుతున్న వాళ్ళు అనేకం..సోషల్ మీడియాలో కొందరికి ఉన్న ఫాలోయింగ్ సినిమా స్టార్స్ కి కూడా లేకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అదే రాజకీయ నాయకులకి కూడా వరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పేస్ బుక్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కి షాక్ ఇస్తోంది.

ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ ప్రమోషన్స్ మీద మరిన్ని ఆంక్షలు పెట్టాలని తీర్మానించింది. ఇప్పటివరకు అన్ని రకాల విషయాల ప్రచారానికి సోషల్ మీడియా ఒక వేదిక. అక్కడ చేసుకునే వ్యాపార ప్రకటనలకు ఎవరికి లెక్కలు చెప్పాల్సిన పని లేదు. ఇదే అదనుగా పొలిటికల్ లీడర్స్ ఫేస్ బుక్ వంటి సోషల్ ప్లాట్ ఫామ్ లను తమ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధానమైన ప్రింట్ – ఎలక్ట్రానిక్ మీడియాలకు లకు దీటుగా వెబ్ మీడియాకు కూడా ఇప్పుడు క్రేజ్ పెరిగిపోతోంది. సినిమాలకు – వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఎవరిచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చే రాజకీయ ప్రకటనలు మాత్రం ఇందుకు పూర్తి బిన్నం. ఆ ప్రకటనకర్తలు ఎవరో గుర్తించలేం.అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని పేస్ బుక్ నిర్ణయించింది.