చర్మం జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే... డ్రై ఫ్రూట్ పాక్స్    2018-07-09   01:02:42  IST  Lakshmi P

అందమైన,మచ్చలు లేని ముఖం కావాలని అందరూ ఆశ పడతారు. అయితే దాన్ని సాధించటం చాలా కష్టమని అందరూ భావిస్తారు. అయితే ఇంట్లో సులువుగా అందుబాటులో ఉండే వస్తువులతో చాలా సులభంగా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇప్పడూ ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్ ముక్క,బీట్ రూట్ ముక్క,ఒక టమోటా,ఒక స్పూన్ బాదం పొడి మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ లో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

నాలుగు జీడిపప్పులను మెత్తని పొడిగా చేసుకొని దానిలో పచ్చి పాలను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ జీడిపప్పు పొడిలో ఒక స్పూన్ ఆవాల నూనె,రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది.

నాలుగు బాదం పప్పులు,పచ్చి పాలు, రోజ్ వాటర్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీలో వేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేసు ఉంటే మంచి ఫలితం ఉంటుంది.