ముఖం మీద మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరవాలంటే ...బెస్ట్ చిట్కా     2018-03-26   17:52:21  IST  Lakshmi P

ప్రతి ఒక్కరు ముఖం మీద మచ్చలు లేకుండా అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మొటిమల కారణంగా మరియు వాతావరణ కాలుష్యం కారణంగా ముఖం మీద నల్లని మచ్చలు ఏర్పడి చూడటానికి అసహ్యంగా మారుతుంది. దాంతో మార్కెట్ లో దొరికే క్రీమ్స్ రాస్తూ ఉంటాం. అయితే డబ్బు వృధా అవుతుంది. కానీ నల్లని మచ్చలలో పెద్దగా మార్పు ఉండదు. అలాంటప్పుడు కొన్ని చిట్కాల ద్వారా ముఖం మీద నల్లని మచ్చలను సులభంగా తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాకి అవసరమైన వస్తువులను తెలుసుకుందాం.

కావలసిన వస్తువులు
విటమిన్ E క్యాప్సిల్
వాజిలైన్
రోజ్ వాటర్

ఒక బౌల్ లో ఒక స్పూన్ వాజిలైన్ , ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక విటమిన్ E క్యాప్సిల్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకొని అరగంట అయ్యాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా తక్కువ సమయంలోనే నల్లని మచ్చలు తొలగిపోయి తెల్లని కాంతివంతమైన చర్మం సొంతం అవుతుంది.

వాజిలైన్ Healthy White SPF 24 ని ఉపయోగిస్తే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. విటమిన్ Eక్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండుట వలన ముఖంపై నల్లని మచ్చలను తొలగించటానికి సహాయపడుతుంది. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది.