Exclusive : Anushka will not present in Baahubali 1

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో హీరో హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లు ప్రభాస్‌ మరియు అనుష్క. మరో హీరోయిన్‌ తమన్నా కూడా ఉన్నా ప్రముఖంగా అనుష్క పేరు మాత్రమే ఇన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో రాబోతున్న ‘బాహుబలి’ చిత్రంలో అనుష్క పరిమిత పాత్రలోనే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అనధికారికంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రం మొదటి పార్ట్‌లో తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనుందని, అనుష్క చాలా పరిమితంగా కనిపిస్తుందని చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్నారు. అయితే రెండవ పార్ట్‌లో అనుష్క మాత్రమే ఉంటుందని కూడా చిత్ర యూనిట్‌ వర్గాలు అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదనే టాక్‌ కూడా వినిస్తోంది. మొత్తానికి ఏప్రిల్‌లో రాబోతున్న ఈ సినిమాపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం విడుదల అయ్యే వరకు మరెన్ని వార్తలు వినాల్సి వస్తుందో చూడాలి. ఈ చిత్రం రెండవ పార్ట్‌ను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.