బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా వదిలించుకోవడానికి హోమ్ మేడ్ పాక్స్     2018-04-13   23:12:31  IST  Lakshmi P

ప్రతి అమ్మాయి మచ్చలు లేని అందమైన ముఖం కావాలని కోరుకుంటుంది. ముఖం మీద మొటిమలు రావటం,బ్లాక్ హెడ్స్ రావటం సహజమే. ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా జిడ్డు చర్మం వారికి వస్తూ ఉంటాయి. చర్మంలో అధికంగా నూనె ఉత్పత్తి అవటం వలన చర్మ రంద్రాలు మూసుకుపోతాయి. దాంతో బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి బ్లాక్ హెడ్స్ తొలగించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి పాక్స్ తెలుసుకుందాం.

ఒక స్పూన్ గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మృత కణాలు తొలగిపోయి బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.


ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి నాలుగు సార్లు చేస్తే ఫలితం కనపడుతుంది.