జనసేనుడితో జట్టు కట్టనున్న “బీజేపి మాజీ మంత్రి”..?

ఏపీలో రాజకీయ సమీకరనాలు రోజు రోజుకి ఊపందుకుంటున్నాయి.. ఒక పక్క టిడిపి అధినేత కేంద్రంతో డీ అంటే డీ అంటుంటే మరో పక్క బీజేపి కూడా చంద్రబాబుతో సమరానికి సై అంటోంది…అయితే కేంద్రంలో టిడిపి మంత్రులు రాజీనామాలు చేసిన తరువాత రాష్ట్రంలో మంత్రి పదవులకి బిజెపి వాళ్ళు కూడా రాజీనామాలు చేశారు..అయితే ఇప్పటికే ఎంతో మంది కమల నేతలు ఏపీ బీజేపిలో ఉండాలా ఉండకూడదా అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కమల వికాసం ఎలా ఉన్నా సరే ఏపీలో మాత్రం ఈ సారి చావు దెబ్బ తింటుంది అనే టాక్ వినిపిస్తోంది..ఏపీ ప్రజలు అందరికీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఎలా అయితే విలన్ అయ్యిందో ఇప్పుడు బీజేపిని కూడా ఏపీ ప్రజలు విలన్ లానే భావిస్తున్నారు.

అందుకే ఏపీ బీజేపి నేతలు ఇప్పటి నుంచే తమ భవిష్యత్తు పై ముందు జాగ్రత్తలు పడుతున్నారని తెలుస్తోంది..ఎంత తొందరగా బీజేపి ని వీడి వేరే పార్టీలోకి వెళ్తే ఎంతమంచిది ప్రజలు కూడా మనకి పట్టం కడుతారు అనే ఆలోచనకి వచ్చేశారు..అందులో భాగంగానే ఇటీవల టిడిపి కి రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్ బీజేపి ని వీదనున్నారని సమాచారం..అయితే బిజెపి ని వీడిన కామినేని మళ్ళీ తన పాత బాస్ దగ్గరకి వెళ్తారా లేక జగన్ గూటికి చేరుకుంటార అదీ కాకపోతే జనసేన తో జట్టు కడుతారా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారట..అదేంటంటే.