ఏపీ కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం..అధ్యక్షుడిగా మాజీ సీఎం     2018-06-27   06:46:02  IST  Bhanu C

జవసత్వాలు అన్నీ మారిపోయి బక్క చిక్కిపోయిన కాంగ్రెస్ ని నేను కాపాడుతాను అంటూ వస్తున్నారు ఒక సీనియర్ నేత..నా ఎంట్రీ తో కాంగ్రెస్ లో మళ్ళీ జీవం పుట్టుకొస్తుంది అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు..గత ఎన్నికల్లో ఏపీ ప్రజల చేతుల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోను అధికారానికి దూరం రెండు రాష్ట్రాలలో అధికారానికి దూరం అయ్యింది అయితే..తెలంగాణలో టీఆర్ఎస్ తో దెబ్బా దెబ్బా గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో మాత్రం కోలుకునే పరిస్థితిలో లేదు..అయితే ఈ తరుణంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నింపడానికి కాంగ్రెస్ అధిష్టానం నూతన అధ్యక్షుడిని తెరమీదకి తీసుకువస్తోంది..

ఆ నూతన అధ్యక్షడు ఎవరో కాదు మాజీ సీఎం నల్లారి కిరణ కుమార్ రెడ్డి.. మంగళవారం నాడు ఇదే విషయమై కిరణ్ కుమార్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పళ్లంరాజు కిరణ్‌కుమార్ రెడ్డిని ఆహ్వానించారు…అంతేకాదు ఈ క్రమంలోనే కిరణ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఉమెన్ చాందీతో సమావేశం కానున్నారు.అయితే కిరణ్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని ఉమెన్ చాందీ పల్లం రాజుకు భాద్యతలు అప్పగించారు.