Ex CM Kiran Kumar Reddy to Join TDP

స‌మైక్యాంధ్ర‌కు చివ‌రి సీఎంగా ప‌నిచేసిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు రాజ‌కీయంగా బ‌ద్ధ‌విరోధం ఉంది. కిర‌ణ్ ఫ్యామిలీ ఆదినుంచి కాంగ్రెస్‌లోనే ఉంది. కిర‌ణ్ తండ్రి టైంలో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన చంద్ర‌బాబు త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చి సీఎం అయ్యారు.అసెంబ్లీలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి టీడీపీ వాయిస్‌ను అణిచి వేస్తున్నార‌ని..కిర‌ణ్ త‌న ముందు పాలిటిక్స్‌లో చిన్న‌పిల్లాడు అని..ఆయ‌న తండ్రితో క‌లిసి ప‌నిచేశాన‌ని..త‌న‌కు గౌర‌వం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే వేడుకున్న‌ట్టుగా రిక్వెస్టులు చేసేవారు.

ఏదేమైనా చంద్ర‌బాబు అంటే కిర‌ణ్‌కు అస్స‌లు గిట్టేది కాదు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు చంద్ర‌బాబు చెంత‌కే, ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టేట్‌ను డివైడ్ చేయ‌డంతో ఆ పార్టీపై తిరుగుబావుటా ఎగ‌ర‌వేసిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డి జై స‌మైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేశారు.