Everything you should know about the real “Mahishmati” Kingdom

భారతదేశంలో మాహిష్మతి అనే రాజ్యం ప్రాచీనయుగంలో ఉండేది. ఇది మధ్యభారతంలో నర్మద నది ఒడ్డున ఉండేది. ఇది విష్ణుపురాణం, మహాభారతంలో పేర్కొనబడిన అవంతి రాజ్యంలో ఒక దక్షిణ నగరం. హైహయాస్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు మాహిష్మతి, ఉజ్జయిని రెండు ప్రధాన నగరాలుగా ఉండేవి. కొంతకాలం తరువాత మాహిష్మతి అనుప రాజ్యానికి రాజధానిగా మారింది. ఈ రాజ్యం గురించి మహాభారతంలో ఆనవాళ్ళు దొరుకుతాయి. మన తెలుగు గ్రంధాలలో కూడా మాహిష్మతి గురించి ఉండటం విశేషం.

ఆంధ్రమహాభారతంలోని సభా పర్వాన్ని చూస్తే మాహిష్మతిని నిలా అనే నిశాడదేశ రాజు పరిపాలించేవాడని, ఆ రాజు కూతురిని చూసి సూర్యదేవుడు ప్రేమలో కూడా పడ్డాడని ఉంటుంది. అయితే సూర్యదేవుడు ఒక బ్రహ్మణరూపంలో రూపంలో ఆమెతో చెలిమి చేస్తాడట. అది చూసిన రాజు ఆ బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోకుండా అతడిని బంధించాలని చూసినా, ఆ తరువాత సూర్యభగవానుడు అని తెలుసుకొని క్షమాభిక్ష అడుగుతాడట.

ఈ మాహిష్మతి 6వ శతాబ్దం, 7వ శతాబ్దం సమయంలో కలుచూరి రాజుల రాజధానిగా ఉండేది. పాళీ రచనల్లో, సంస్కృత రచనల్లో దీని గురించి రాసి ఉంటుంది.

ఆరకంగా నిజంగానే ఉన్న మాహిష్మతి పేరుని వాడుకొని, సరికొత్త ప్రపంచం సృష్టించి, రెండు భాగాలు కలిపి 2200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు మన జక్కన్న. అన్నట్టు చెప్పడం మరచిపోయాం .. ఈ మాహిష్మతిని ఇప్పుడు మహేశ్వర్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మధ్యప్రదేశ్ కిందికి వస్తుంది.