Everything you should know about Jio Phone (4G)

ఎప్పుడెప్పుడా అని భారతీయ ప్రజలు ఎదురుచూస్తున్న జియో ఫోన్ ప్రకటన రానే వచ్చేసింది. నిన్న జరిగిన సమావేశంలో ముఖేష్ అంబాని ఈ సంచలనాత్మక మొబైల్ ని ప్రపంచానికి పరిచయం చేసారు. దీని పేరు జియో ఫోన్. దీనికి మళ్ళీ తల తోక ఏమి అంటించలేదు. ఇది పూర్తిగా స్మార్ట్ ఫోన్ కాదు, అలాగని కేవలం ఫీచర్ ఫోన్ కాదు. రెండు కలిసిన హైబ్రిడ్ ఫోన్ లాంటిది అనుకోండి. ఈ స్పెషల్ గురించి వింతలు విశేషాలు ఏంటో చూడండి.

* ఆగష్టు 15న మొబైల్ బేటా వెర్షన్ లాంచ్ అవుతోంది. ఆగష్టు 24 నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతాయి.

* ఈ ఫోన్ ని మీరు పూర్తి ఉచితంగా పొందుతున్నట్లే లెక్క. ఎలా అంటే, ఈ ఫోన్ ని రూ.1500 పెట్టి బుక్ చేసుకోవాలి. మీరు కట్టిన ప్రతి రూపాయి మూడు సంవత్సరాల తరువాత రీఫన్డబుల్. అంటే, రూ.1500 ని మీరు మూడు సంవత్సరాల తరువాత రివర్స్ పొందవచ్చు.

* ఇది 4G ఫోన్. LTE తో పాటు VoLTE నెట్వర్క్స్ పై పనిచేస్తుంది.