Even Amala Paul wants see her suchi leaks video

సుచీ లీక్స్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. తమిళ ఇండస్ట్రలోని చీకటి కోణాలెన్నో బయటపెట్టింది సింగర్ సుచిత్ర. ఓ టాప్ హీరో సీక్రేట్ అఫైర్లు, ముగ్గురు క్రేజీ హీరోయిన్ల నగ్న చిత్రాలు, వీడియోలు, ఇద్దరు రహస్య ప్రేమికుల బాగోతాలు .. ఓ మూడు నాలుగు రోజులు ఇంటర్నెట్ ని షేక్ చేసింది సుచిత్ర.

హన్సిక, సంచితాల తరువాత తన దగ్గర అమలా పాల్, అండ్రియా నగ్న వీడియోలు ఉన్నాయని, వారిద్దరు ధనుష్, అనిరుధ్ చేసిన చీకటి కార్యక్రమాలు మొత్తం తనకు తెలుసు అని, అన్ని బయటపెడతానని చెప్పింది సుచిత్ర. ఇంతలోనే ఆమెను సైలెంట్ చేసారు. అకౌంట్ డిలీట్ చేయించారు. ప్రస్తుతం సుచిత్ర ఎక్కడుందో తెలీదు. ఇండియాలో మాత్రం ఉండట్లేదని చెబుతున్నారు తమిళ సినీజనాలు. ఈ వివాదం సుచిత్ర కనుమరుగవడంతో అక్కడకే ముగిసింది.

మళ్ళీ ఇన్నాళ్ళకు అమలాపాల్ ఈ టాపిక్ లేవనెత్తింది. వీఐపి 2 ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అమలా “చాలామంది లాగే తాను కూడా తన వీడియో (నగ్న) ఎప్పుడు బయటకి వస్తుందా అని ఎదురుచుస్తున్నానని, బయటపెడతామన్నావారు ఆదివారం బయటపెడతానని ఎప్పుడో చెప్పారు. ఇంతవరకు ఆ ఆదివారం రాలేదు, మరి ఎప్పుడు వస్తుందో” అంటూ వెటకారంగా జవాబిచ్చింది.

ఇప్పుడు ఇంత ధైర్యం ప్రదర్శిస్తూ వెటకారం చేస్తున్న అమలా, మరి సుచీ లీక్స్ వేడిలో మాత్రం బయటకి రాలేదు, వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు సుచిత్ర లేనప్పుడు మాత్రం కామెడి చేస్తోంది.