ప్రమాదంలో చిక్కుక్కున్న ఏనుగును రక్షించడానికి ఆ అధికారులు సాహసమే చేశారు...హ్యాట్సాఫ్     2018-08-15   10:48:38  IST  Rajakumari K

భారీ వర్షాలు,వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది..నదులు పొంగిపొర్లుతున్నాయి,కొండచరియలు విరిగిపడుతున్నాయి..నీళ్లల్లోనే కేరళ ఉందా అన్నట్టుగా తలపిస్తుంది అక్కడి పరిస్థితి..ఇదిలా ఉంటే వరదల్లో చిక్కుకుంది ఒక ఏనుగు..ఆ ఏనుగుని రక్షించడానికి అక్కడి అధికారులు పెద్ద సాహసమే చేశారు.. సినిమా సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన గంటపాటు ఉత్కంఠకు గురిచేయగా ఏనుగుని రక్షించినందుకు వన్యఫ్రాణి ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్నారు ఆ అధికారులు..

త్రిస్సూర్‌లోని చలక్కుడిపూజనది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెరింగల్‌కూతు డ్యాం అన్ని గేట్లను తెరిచారు. అదే సమయంలో అక్కడ దగ్గరిలోని అతిరిప్పిల్లి అడివి ప్రాంతంలో ఏనుగులు గుంపు సంచరిస్తుంది.గేట్లు ఎత్తివేయడంతో వరద ప్రవాహం పెరిగింది..ఆ ప్రవాహంలో అన్ని ఏనుగులు తప్పించుకోగా ఒక ఏనుగు మాత్రం వరదల్లో చిక్కుకుపోయింది.ఎటూ పోలేని స్థితిలో ఒక బండరాయి పైకి ఎక్కి నిల్చుంది.అంతకంతకూ వరద ఉదృతి పెరుగుతుంది. సరిగ్గా అప్పుడే నదీ ప్రవాహంలో చేపలు కొట్టుకువస్తాయన్న ఆశతో కొంత మంది మత్స్యకారులు అటవీ ప్రాంతం వద్ద వేటకు వెళ్లారు. అవతలి పక్కన బండరాయిపై ఏనుగు నిల్చొన్న ఏనుగును చూసి ,జలకాలాడుతుందేమో అని తమ పని చేసుకుంటున్నారు.ఎంతసేపైనా ఏనుగు కదలకపోవడంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా అది ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉందని గుర్తించి,అటవీ శాఖ అధికారులకు సమాచారం అంధించారు

Forrest Officers,Shutting Dam Sluice Gates

అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో కాలం గడిచేకొద్దీ బండరాయిని కూడా నీరు ముంచెత్తడం ఖాయమని గుర్తించి.. ప్రమాదంలో ఉన్న గజరాజాన్ని కాపడటానికి సిద్దమయ్యారు. ప్రాజెక్టు గేట్లు దించడం తప్ప మరో దారిలేదని వెంటనే ప్రాజెక్టును నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులను సంప్రదించారు. పెరింగల్‌కూతు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 424 అడుగులు కాగా.. డ్యాం అధికారులకు ఏనుగు ప్రమాదంలో ఉన్న విషయం గురించి చెప్పినప్పుడు రిజర్వాయర్‌లో 422.5 అడుగుల నీరు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో భారీగా ఉంది. అయినా వారు ఏనుగు ప్రాణాలు కాపడటానికే సిద్ధమయ్యారు. దీంతో పాటు ఓ హెచ్చరిక చేశారు.

‘డ్యాం గేట్లను గంట పాటు దించుతాం. గేట్లు దించిన అరగంట తర్వాత నుంచి నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత అరగంట సమయంలో మీరు ఆ ఏనుగును బయటకు తీసుకురావాలి. గంట కంటే ఎక్కువ సమయం గేట్లు దించి ఉంచితే.. డ్యాం మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గంట తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరిస్తే.. ఇప్పటికి రెండింతల ప్రవాహం ముంచెత్తుతుంది. అప్పుడు ఆ ఏనుగును దేవుడు కూడా కాపాడలేడు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి దిగువన ఉన్న చర్పా జలపాతం నుంచి కిందకు పడుతుంది’ అని డ్యాం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సూచించారు.ఆ తర్వాత గంటపాటు డ్యాం గేట్లు కిందకి దించేశారు. వరద ప్రవాహం తగ్గగానే ఆ ఏనుగును అడవీలోకి వెళ్లేలా తరిమేశారు. అనుకున్న సమయం కంటే కాస్త తొందరగానే పని పూర్తవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.