సాగిన చర్మాన్ని టైట్ గా మార్చే ఎగ్ వైట్ మాస్క్     2018-06-12   00:46:35  IST  Lakshmi P

ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అయితే సరైన మార్గంలో వెళ్లి దాన్ని సాధించాలి. ప్రతి చర్మ చర్మ సమస్యకి కంగారు పడకుండా మన ఇంటిలో ఉండే సహజమైన పదార్ధలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. చర్మం వదులుగా మారితే వయస్సు ఎక్కువ వారీగా కనబడతారు. సాగిన చర్మాన్ని టైట్ గా మార్చటానికి కొన్ని ప్యాక్స్ ఉన్నాయి. వాటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక గుడ్డు తెల్లసొనలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.