సాగిన చర్మాన్ని టైట్ గా మార్చే ఎగ్ వైట్ మాస్క్     2018-06-12   00:46:35  IST  Lakshmi P

రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక బౌల్ లో ఒక గుడ్డు తెల్లసొన తీసుకోని దానిలో అరస్పూన్ మొక్కజొన్న పిండి,అరస్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. ఈ విధంగా నెలకు ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.