కోడిగుడ్డు + పెరుగుతో చుండ్రుకు గుడ్ బై....ఎలాగో తెలుసా?     2018-05-30   23:45:39  IST  Lakshmi P

చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. ఎన్నో రకాల షాంపూలను ఉపయోగిస్తాం. తాత్కాలికంగా తగ్గుతుంది. ఆ తరవాత మళ్ళీ చుండ్రు సమస్య మొదలు అవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు అందుబాటులో ఉండే పెరుగు,కోడిగుడ్డును ఉపయోగించి చుండ్రు సమస్యను చాల సులభంగా తగ్గించుకోవచ్చు. కోడిగుడ్డు + పెరుగు చుండ్రు సమస్య నుండి ఎలా తగ్గిస్తాయో వివరంగా తెలుసుకుందాం.

పెరుగు

పెరుగులో ఉండే సహజ కొవ్వులు మాడును తేమగా ఉంచి పొడిగా మారకుండా చేస్తాయి. దాంతో దురద తగ్గుతుంది. దురద తగ్గితే చుండ్రు కూడా తగ్గుముఖం పడుతుంది. పెరుగులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తల మాడుపై దురదకు కారణం అయిన కారకాలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.