కంటి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు    2018-04-26   00:12:11  IST 

నేటి బిజీ జీవనశైలిలో ఎన్నో ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నాడు మనిషి. వాటిలో ముఖ్యమైనది కంటి సమస్యలు. ప్రతి రోజు లాప్ టాప్ ల ముందు కూర్చొని పనిచేసేవారు,ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడేవారు కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే కొంత మందికి కంటి నుండి నీరు కారటం మరియు పొడిబారటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే కంటి సమస్యల నుండి బయట పడవచ్చు.

ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకోని గోరువెచ్చని నీటిలో ముంచి కనురెప్పల మీద పెట్టి 15 నిముషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నిదానంగా కంటి లోపల కూడా శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయటం వలన కంటి లోపల దుమ్ము,ధూళి అన్ని తొలగిపోతాయి. అలాగే కంటిలో నీటి ఉత్పత్తి పెరగటంతో పొడిబారటం తగ్గుతుంది.

కొబ్బరి నూనెలో ముంచిన కాటన్ బాల్ ని మూసిన కనురెప్పపై 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయటం వలన కళ్ళకు మంచి రిలీఫ్ కలుగుతుంది. ఈ విధంగా రోజులో ఎన్నిసార్లయినా చేయవచ్చు.