వెంట్రుకలు రాలిపోతున్నాయా.... అయితే ఈ ఆయర్వేద చిట్కాలు ఫాలో అవ్వండి

నేటి జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. మగవారు బట్ట తల వస్తుందని కంగారు పడితే,ఆడవారు మాత్రం తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అని బాధపడుతూ ఉంటారు. అయితే మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్న ఈ చిట్కాలను ఫాలో అయితే ఈ జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

శీకాయ‌ను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో నీటిని కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటె జుట్టు రాలటం తగ్గుతుంది.