వారంలో ఏ రోజున ఏ పని చేస్తే కలిసివస్తుందో తెలుసా?     2018-06-23   22:15:17  IST  Raghu V

ప్రతి ఒక్కరు ఏదైనా పని చేసినప్పుడు మంచి రోజు చూసుకొని మరీ చేస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు. వారి అనుగ్రహంతోనే పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ రోజు ఏ పని చేస్తే కలిసి వస్తుందో తెలుసుకుందాము.

ఆదివారం

ఆదివారంనకు అధిపతి సూర్యుడు. అందువల్ల ఆ రోజు గులాబీ లేదా కుంకుమ రంగు వస్త్రాలు ధరించి రాజకీయ వ్యవహారాలు, పదోన్నతలకు ప్రయత్నం లాంటివి మొదలుపెడితే ఫలితం ఉంటుంది.

సోమవారం

సోమవారంనకు అధిపతి. చంద్రుడు. ఆ రోజున తెల్లటి దుస్తులను వేసుకొని షాపింగ్, ఇల్లు శుభ్రచేయడం, పార్టీలు లాంటివి చేయటం మంచిది.

మంగళవారం

మంగళవారంనకు అధిపతి కుజుడు. ఈ రోజు ఎర్రటి వస్త్రాలను ధరించాలి. ఈ రోజు యంత్రాలు కొనుగోళ్లు, మరమ్మత్తులకు అనుకూలమైన రోజు.

బుధవారం

బుధవారంనకు అధిపతి బుధుడు. ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపారాల్లో పెట్టుబడులకు అనూలమైన రోజు. బుధుడు తెలివితేటలను ఇస్తాడు. అందువల్ల తెలివికి సంబందించిన పనులను చేయాలి.