Dwaraka Movie Review

చిత్రం : ద్వారక

బ్యానర్ : లెజెండ్ సినిమా

దర్శకత్వం : శ్రీనివాస రవీంద్ర

నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు

సంగీతం : సాయికార్తిక్

విడుదల తేది : మార్చి 3, 2017

నటీ-నటులు – విజయ్ దేవరకొండ, పూజ ఝవేరి, ప్రకాష్ రాజ్, మురళీశర్మ తదితరులు

తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతోనే మంచి నటుడు అనే పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, పెళ్ళి చూపులు తో భారి హిట్ ని సాధించి పెద్ద బ్యానర్ సినిమాలు జేబులో వేసుకున్నాడు. ద్వారక పెళ్ళిచూపులు అనే సినిమాకి ముందు ఒప్పుకున్న సినిమా కావడంతో, దీని వెనుక పెద్ద పేర్లు లేవు. మరి ద్వారక విజయ్ ఫామ్ ని దెబ్బతీసే సినిమానా లేక మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టే సినిమానా ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే :

ఓ దొంగతనం కోసం వెళ్ళిన శీను (విజయ్ దేవరకొండ) అనుకోకుండా ద్వారక అనే అపార్ట్‌మెంట్ లో చిక్కుకోని బాబా కృష్ణానందస్వామిగా మారాల్సివస్తుంది. ఇతన్ని హైలెట్ చేసే మరో దొంగ గురువు (పృధ్వీ). లోనికి మాయలు మంత్రాలు చేసుకుంటూ, డబ్బులు దండుకుంటున్న ఈ ఫేక్ బాబా, బయటకి మాత్రం అద్వితీయ శక్తులు కలవాడు. ఈ దొంగ బాబా ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు (పూజ ఝవేరి). కాని, ఆ అమ్మాయి పెళ్ళి కోసం తన దగ్గరికే ఆశీర్వాదల కోసం తీసుకొస్తారు ఆమె పేరెంట్స్.

ఇదిలా ఉంటే, కృష్ణానందస్వామిని అడ్డుపెట్టుకోని డబ్బులు దండుకోవాలనే ముఠా ఓవైపు, అతని బండారం బయటపెట్టాలనే నాస్తికుడు మరోవైపు .. ఈ మూడు చిక్కులని మన దొంగ బాబా ఎలా ఎదుర్కున్నాడో తెర మీదే చూడండి.

నటీనటులు నటన :

నటుడిగా విజయ్ తనలోని మరో కోణాన్ని ఈ సినిమాతో బయటపెట్టి, తనకి అద్భుతమైన భవిష్యత్తు ఉందని నిరూపించుకున్నాడు. తన డైలాగ్ డెలివరిలో ఉండే నేచురాలిటి తనకి ఎంత ప్లస్ పాయింటో చెప్పడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. పూజ అందంగా ఉంది. అంతకుమించి చెప్పడానికి ఏమి లేదు. కామెడియన్ పృథ్వీ ఎప్పటిలాగే నవ్విస్తాడు. మురళీశర్మ, ప్రకాష్ రాజ్ పాత్రలు బాగున్నాయి.

టెక్నికల్ టీమ్ :

శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫి బాగుంది. సాయికార్తిక్ సంగీతం చాలా పెద్ద డిజపాయింట్ మెంట్. విజయ్ గత సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా మంచి సంగీతం ఉంటుందని అనుకుంటే అది అత్యాశే. మాటలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ లో లోటుపాట్లు ఉన్నాయి. కథ, కథనం కొంచెం కొత్తగా ఉండటంతో, నరేషన్ లో ఉన్న సమస్యలు మరీ పెద్దగా కనిపించవు.

విశ్లేషణ :

రోటిన్ రొట్ట సినిమాల మధ్యలో మరో డిఫరెంట్ సినిమా ద్వారక. స్టోరి సెలెక్షన్ లో తన ఖచ్చతత్వం మరోసారి చూపించాడు విజయ్. కథలో భాగంగానే ఉండే కామెడి, ప్రజల అమాయకత్వంతో మతగురువులు ఎలా అడుకుంటారో అనే సందేశం, అర్థవంతమైన మాటలతో సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఫక్తు కమర్షియల్‌ హంగులు లేవు. ఉన్న పాటలు బోర్ కొడతాయి. బలమైన ప్రతినాయకుల పాత్రలు లేకపోవడం ఓ మైనస్ పాయింట్. అక్కడక్కడ సినిమా నెమ్మదించడానికి ఎడిటింగే కారణం. మొత్తం మీద విభిన్న అభిరుచి గల ప్రేక్షకులను అలరించే సినిమాగా చెప్పుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

* కథ
* విజయ్ దేవరకొండ
* కథలో భాగమైన వినోదం
* మాటలు

మైనస్ పాయింట్స్ :

* హీరోయిన్, విలన్ పాత్రలు బలంగా లేకపోవడం
* అక్కడక్కడ నెమ్మదించే నరేషన్

చివరగా :

ఇవాళ వచ్చిన సినిమాల్లో బెటర్ వన్

తెలుగుస్టాప్ రేటింగ్ : 3/5