పొడి జుట్టు సమస్యకు బీర్.... నమ్మకం లేదా.... అయితే చూడండి     2018-06-17   00:07:27  IST  Lakshmi P

మీరు జుట్టు సమస్యల కోసం పండ్లు,కూరగాయలు, ఆయుర్వేద పాక్స్ ఇలా అనేక రకాలు ఉపయోగించి ఉంటారు. బీర్ జుట్టు సమస్యల పరిష్కారానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ తేడా లేకుండా అందరిలోనూ జుట్టు పొడిగా మారిపోతుంది. జుట్టులో తగినంత తేమ లేకపోవటం వలన జుట్టు పొడిగా మారిపోతుంది. దాంతో చుండ్రు సమస్యలు కూడా వస్తాయి. జుట్టులో తేమ ఉంటే చుండ్రు సమస్య రాదు. అంతేకాక అనేక జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

తేనె, అరటి, గుడ్డుపచ్చసొన, బీర్ ప్యాక్

తేనెలో తేమ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు ఫోలిసెల్స్ ను బలంగా ఉంచి ఆరోగ్యకరమైన గ్లో ని ఇస్తుంది.

అరటి పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన జుట్టుకు మేలు చేస్తుంది, జుట్టుకు తగిన మాయిశ్చరైజింగ్ గుణాలను అందించి జుట్టుకు డల్ నెస్ తగ్గిస్తుంది