Drugs Case : Tollywood’s sensational names in second list

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఇండస్ట్రీ. పొద్దంతా షూటింగ్ చేస్తారు, రాత్రంతా పార్టీలు చేస్తారు. ఒకటి రెండు సినిమాలు చేసిన లక్షల్లో డబ్బు. సెలబ్రిటి హోదా. పార్టీలకు వెళ్లాలని అనిపించకుండా ఎలా ఉంటుంది ? అన్ని పెద్ద స్నేహాలే, చుట్టూరా పెద్ద ప్రపంచం. కాని ఆ ప్రపంచమే మెల్లిమెల్లిగా చీకట్లోకి కూరుకుపోతూ ఉంటుంది. లేట్ నైట్ పార్టీలు, అందుబాటులో పబ్బులు, డ్రగ్స్ ఇంకెన్నో. కొందరు అలవాటు పడతారు. కొందరు ప్రయత్నించి వదిలిపెడతారు, మరికొందరు మనకెందుకు ఆ గోల అంటూ పార్టీలకి అస్సలు వెళ్ళరు. ఈరోజు టాలివుడ్ లో డ్రగ్స్ వాడటం అంటే అదో హోదా. డ్రగ్స్ ఇవ్వడం అంటే గుడ్ విల్.

ఆ గుడ్ విల్ కోసమే పూరి పార్టీలు అరేంజ్ చేసి, అక్కడికి వచ్చే పెద్ద పెద్ద మనుషులకి డ్రగ్స్ అందిస్తారని ఆరోపణ. ఓ వయసు వచ్చాక సిగరెట్/మద్యం అలవాటు లేకపోతే కుర్రాడిని ఎలా ఎగతాళి చేస్తారో, సినిమా ఇండస్ట్రీలో ఉంటూ పార్టీలకు వెళ్ళని వారిని, పార్టీ కల్చర్ కి అలవాటు పడి డ్రగ్స్ కి అలవాటు పడని వారిని అలానే ఎగతాళి చేస్తారు. అందుకే మొదట విడత విచారణ కోసం పెద్ద లిస్టు వదిలారు ఎక్సైజ్ అధికారులు. అందులో మనం ఊహించని పేర్లు ఉన్నాయి కదా. రవితేజ లాంటి హీరో రేవ్ పార్టీలకి తెగ వెళతాడు అని మనం ఊహించామా ? నవదీప్ లాంటి యువహీరో డ్రగ్స్ సరఫరా చేస్తాడని అనుకున్నామా ? ఈ షాకులు ఇక్కడితో ఆగలేదు. ఈ విచారణలో ఇంకొన్ని సంచలనాత్మక పేర్లు బయటపడ్డాయి.

అందులో ఇద్దరు ముగ్గురు ఈతరం క్రేజీ హీరోయిన్లు ఉన్నారు అంటున్నారు. ఇద్దరు నిర్మాతల కొడుకులు ఉన్నారు అంటున్నారు. ఓ నిర్మాత ఉన్నాడు అంటున్నారు. ఓ సిని పెద్ద కుటుంబంలోని కూతురు ఉంది అంటున్నారు. ఎవరు వీళ్ళంతా ? మొదటి బ్యాచ్ ని అడిగితె వీరి పేర్లు తెర మీదకి వచ్చాయి, మరి వీరిని విచారిస్తే ? ఇంకొన్ని కొత్త పేర్లు బయటకి వస్తాయేమో. ఆలోచించడానికి కూడా భయం కలుగుతోంది కదా. హైదరాబాద్ డెవలప్ అవుతోంది అంటే ఏంటో అనుకున్నాం.