మత్తులో పడి, తాము చనిపోయి, ఐదు నెలల పసిపిల్లని చంపుకున్నారు

కంటతడి పెట్టించే సంఘటన ఇది. మత్తుపదార్థాలకు బనిస అయిన తల్లిదండ్రులు, తాము బలవుతూ ఐదు నెలల పసిపాపను చంపుకున్నారు. మొత్తం అమెరికాని విషాదంలో ముంచేసిన ఈ ఘటన జాన్స్ టౌన్ అనే పట్టణంలో జరిగింది.

ఆ పట్టణంలో నివసిస్తున్న దంపతులు జాసన్ ఛాంబర్స్, చెల్సియా కార్డరో .. ఇద్దరు మాదక ద్రవ్యాలకి బానిసలు. హెరాయిన్ తీసుకోనిదే పూట్ల గడవదు వీరికి. వారం క్రింద, ఓరోజు వీరు హెరాయిన్‌ మరీ ఎక్కువగా సేవించారట. దాంతో ఇద్దరు ఒకేరోజు, కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణించారని డాక్టర్లు చెబుతున్నారు.

గుండెను పిండేసే విషయం ఏమిటంటే, వీరికి ఐదు నెలల పాప ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవటంతో ఆ పాప ఆకలి, దాహాన్ని తీర్చేవారు ఇంట్లో లేక కన్నుమూసింది. చాంబర్స్, చెల్సియా చనిపోయిన వారం తరువాత ఈ సంఘటన వెలుగులోకి రావడం విడ్డూరం.

అమెరికాలో మత్తులో పడి చనిపోవడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. ప్రతీ ఏట వేలమంది చనిపోతున్న, తాజాగా మత్తుకి అలవాటు పడిన పేరెంట్స్ మూలాన ఐదు నెలల పసికందు ప్రాణం విడవడం నిజంగా బాధకరం.