జనసేనుడి నిరాహారదీక్షలో అనుమానాలేన్నో..?     2018-05-25   23:21:08  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష చేపట్టారు. అయితే ఆ నిరాహారదీక్ష చాలా సీక్రెట్ గా చేస్తున్నారంట. పవన్ ప్రస్తుతం ఓ రిసార్ట్ లో ఉంటున్నారు. అక్కడే ఈ దీక్ష చేస్తున్నాడు. అయితే ఆయన చేస్తున్న దీక్ష ఎవరికీ కనిపించదు. కనీసం మీడియా కి కూడా అనుమతి లేదు. కేవలం జనసేన కు సంబంధించిన కొంతమంది మాత్రమే ప్రెస్ కి ఫోటోలు , వీడియో లు అందిస్తారంట. ఇదంతా పెద్ద గమ్మత్తు వ్యవహారంగానే కనిపిస్తోందని మీడియా ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా … మూడు రోజుల కిందట… పలాసలో కిడ్నీ రోగులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..వారిని ఆదుకోవడం లేదంటూ మండిపడ్డారు. రెండు రోజుల్లో ఆరోగ్యమంత్రిని నియమించి… బాధితులకు సాయం కనుక అందించకపోతే .. తాను ఇక్కడి నుంచే నిరాహార దీక్ష చేస్తాను అని పవన్ని ప్రకటించేశాడు. ప్రభుత్వానికి 48 గంటల సమయం కూడా ఇచ్చాడు. అయితే పవన్ ఇలాగే వాగుతాడులే అనుకుందో ఏమో కానీ ప్రభుత్వం పెద్దగా పవన్ వ్యాఖ్యలను పట్టించుకోలేదు. దీంతో పవన్ 24 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించాడు.