Don’t Indian men want $ex ? Asks Bolly heroine

ఇప్పుడు బాలివుడ్ లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, బాబుమొషాయ్ బందుక్ బాజ్. ఈ సినిమాలో ఖాన్స్, హృతిక్ లేరు. అయినా నిత్యం వార్తల్లో ఉంటోంది‌‌‌. దానికి కారణం ఓ పెద్ద వివాదం. ఈ సినిమాకి ఒకటి కాదు, రెండు కాదు 48 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డ్. 48 కట్స్ అంటే ఇక సినిమాలో ఏం మిగిలి ఉంటుంది ?

ఈ సినిమాలోని శృంగార సన్నివేశాలు, బూతు డైలాగులు ఎక్కువ ఉన్నాయంట. దాంతో కట్ చెప్పుకుంటూపోయారు‌. అక్కడితో ఆగకుండా ఆ సినిమా నిర్మాతని అవమానించారట సెన్సార్ సభ్యులు. ఈ సినిమాకి నిర్మాత ఓ మహిళ కావడంతో, ఒక స్త్రీ ఇలాంటి ఎలా నిర్మిస్తుంది? అసలు ఆడదానివేనా నువ్వు ? ఇలాంటి సినిమా తీసావ్ అంటూ విమర్శించారట సెన్సార్ సభ్యులు. దాంతో కోర్టుకి వెళ్ళారు ఈ సినిమా మేకర్స్.