Dont Do karthika masam afternoon sleep

కార్తీకమాసం అనగానే ప్రతి రోజు స్నానాలు,పూజలు,ఉపవాసాలు గుర్తుకు వస్తాయి. ఈ నెల మొత్తం పూజలు భక్తి శ్రద్దలతో చేస్తే చాలా పుణ్యం వస్తుంది. దాంతో అందరు మానకుండా ఈ నెలలో పూజలు,తల స్నానాలు,ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు. అయితే తల స్నానం సూర్యోదయానికి ముందే లేచి చన్నీళ్లతో తల స్నానము చేయాలి. అంతేకాక తల స్నానం చేసే ముందు తలకు నూనె రాయకూడదు. ఆలా రాస్తే మంచిది కాదు.

ఈ మాసంలో అబద్దాలు ఆడటం, ఎదుటివారిని బాధ పెట్టడం, మోసాలు ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటివి ఏ మాసంలో అయినా చేయకూడదు. కార్తీకమాసంలో అస్సలు చేయకూడదు.కార్తీకమాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యమైనా పని. అయితే ఆ దీపంలో ఒక వత్తు వేయకూడదు. దీపంలో 2 వత్తులను వేసి మాత్రమే వెలిగించాలి.

అంతేకాక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అసలు పడుకోకూడదు. ఎందుకంటే ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసం. అలా గాని పడుకుంటే శివకేశవులకు కోపం వస్తుందంట. ఈ మాసంలో మద్యాహ్నం గాని పడుకుంటే తీరని కష్టాలు వస్తాయని అంటారు.కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో నిద్ర పోకుండా చూసుకోండి.