హెచ్ 1బీ వీసాపై ట్రంప్ మరో షాకింగ్ డెసిషన్  

దేశ విదేశాల నుంచీ వచ్చే వలసదారులని అడ్డుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలని మరింత ఉదృతం మరెంతో కఠినతరం చేసింది..ముఖ్యంగా భారతీయులకి అడ్డుకట్ట వేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది..అంటున్నారు పరిశీలకులు ..ఇప్పటికే హెచ్ 1బీ ద్వారా ఎన్నారైలకి అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ వీసా పొందిన వారిని కూడా ఇంటికి సాగనంపాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది..వివరాలోకి వెళ్తే..

అసలు విషయం ఏమిటంటే..ఇకపై హెచ్1బీ వీసాల గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఎక్స్‌టెన్షన్ కోసం వీసాదారులు దరఖాస్తు చేసుకుంటారు…ఆ వీసాలో ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా సరే చేస్తూ ఉంటారు అయ్తీ ఈ క్రమంలో అలాంటి వ్యక్తుల దరఖాస్తులు కూడా రిజక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటూ వారి దరఖాస్తులు తిరస్కరించబడితే వారు దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి పేర్కొన్నారు…ఈ మేరకు కొత్త నిభందనలు అమలులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు..

అయితే హెచ్1బీ వీసా గడువు ముగిసిన తర్వాత 240 రోజులు అమెరికాలో పని చేసే వీలుంది. మరి తాజాగా వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం గడువు ముగిసి, గడువు పెంపు దరఖాస్తు కూడా తిరస్కరణకు గురయితే వెంటనే ‘నోటిస్ టు అప్పియర్’ ఇష్యూ చేస్తారు. ఆ సమయంలో వీసాదారుడు విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒకవేళ వీసాదారుడు అందుబాటులో లేక విచారణకు హజరుకాకపోతే అతడిపై అయిదేళ్ల పాటు దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తామని ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి తెలిపారు..అయితే ఈ నిభందనలు కేవలం ఎన్నారైలని అమెరికా నుంచీ పంపివేయడానికేనని అంటున్నారు విశ్లేషకులు.