Does tight bra causes breast cancer ?

స్త్రీలు వాడే రెండు రకాల లోదూస్తుల్లో ఒకటి బ్రా. ఇది వేసుకోవడం వలన శారీరకంగా కంఫర్ట్ ఏమైనా ఉంటుందా అనే ఏమి ఉండకపోవచ్చు. చాలావరకు బ్రా మహిళల్ని ఇబ్బందే పెడుతుంది. మరి వేసుకోవడం ఎందుకు అంటే బలమైన కారణాలే ఉంటాయి. బ్రా వాడకపోతే ట్రాన్స్ పరెంట్ దుస్తులు వాడటం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే బట్టలు తడుపుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందా. అందుకే బ్రా అవసరం. కాని దీనివలన శారీరకంగా ఎలాంటి లాభాలు లేవు. బ్రా వేసుకోవడం వలన వక్షోజాలు టైట్ గా ఉంటాయని అనుకోవడం పెద్ద అపోహా. మరి నష్టాలు ఏంటి ? ముఖ్యంగా కొన్నిరకాల బ్రా వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. అందులో నిజమెంత ? అది కూడా అపోహా అని ప్రచారం జరుగుతోంది. రెండిట్లో ఏది నిజం ?

అన్నిరకాల బ్రాలు ప్రమాదకరం కాదు. కొందరు స్త్రీలు వక్షోజాలు పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించాలని పుష్ అప్ బ్రా వాడతారు. ఇలాంటి బ్రాలు చాలా టైట్ గా ఉంటాయి. వీటివలన వక్షోజాలు పైకి ఒత్తుగా, గట్టిగా, పెద్దగా కనిపిస్తాయి కాని లోపల చేయాల్సిన నష్టం చేస్తూనే ఉంటాయి. ఎలా అంటారా ? ఈ పుష్ అప్ బ్రా లాంటి టైట్ బ్రాలు వాడటం వలన లింఫ్ డ్రైనేజ్ జరుగుతుంది. అలా వక్షోజాలు బంధించినట్టు ఉండటం వలన టాక్సిన్స్ సరిగా బయటకి వెళ్ళవు. అంటే మూత్ర విసర్జన సమయంలో బయటకి వెళ్ళాల్సిన టాక్సిన్స్ చాలావరకు వక్షోజాల స్థలంలో ఇరుక్కుపోతాయి. ఆ తరువాత ఏముంది ? క్యాన్సర్ సెల్స్ పెరగటానికి మంచి అవకాశం ఇచ్చినట్లే.