Do you know why black mark applied to childs head

చిన్న పిల్లలు అంటే అందరికి ఇష్టమే. అలాగే ముద్దు కూడా చేస్తూ ఉంటారు. ఆలా చేసినప్పుడు పిల్లలకు దిష్టి తగులుతుందని చాలా మంది భావించి పిల్లలకు దిష్టి తీయటం లేదా నల్ల చుక్క పెట్టటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా పిల్లలకు నల్ల చుక్క పెట్టటం వలన దిష్టి తగలదని నమ్మకం.

ఎవరైనా పిల్లలను చూసినప్పుడు వారి దృష్టి పిల్లల మీద కాకుండా నల్ల చుక్క మీద పడుతుంది. దాంతో పిల్లలకు దిష్టి తగలదు. ఈ క్ర‌మంలో పిల్ల‌ల‌కు నెగెటివ్ ఎన‌ర్జీ కాకుండా పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంద‌ట‌. దాంతో వారి ఆరోగ్యం బాగుంటుంద‌ని న‌మ్ముతారు.