అణుదాడి జరిగితే ట్రంప్ ఎక్కడ తలదాచుకుంటారో తెలుసా??     2018-08-14   12:20:29  IST  Rajakumari K

జపాన్ లోని హీరోషిమా, నాగసాకి మీద అమెరికా అణుదాడి జరిగి ఢెభ్బై ఏళ్లు కావస్తున్నా యావత్ ప్రపంచం ఆ ఘటనను మర్చిపోలేదు. అణుదాడి చేసినప్పుడు అక్కడి ప్రజలను ఫాలౌట్ షెల్టర్లలోకి తరలించి ఉంటే 30శాతం మంది బతికి ఉండేవారని అంచనా.అదే అమెరికా తమ దేశంపై అణుదాడి జరిగితే ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేసుకుందో తెలుసా..ముఖ్యంగా అణుదాడి జరిగినప్పుడు ట్రంప్ ఎక్కడ తలదాచుకుంటారో తెలుసా…

Nuclear Bomb Blast,Trump,Trump's Iran Nuclear Deal

అణు దాడి జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు సురక్షితమైన బంకర్‌లోకి వెళ్లి తలదాచుకుంటారు. ట్రుమెన్ దగ్గరి నుంచి ప్రస్తుత ట్రంప్ వరకు అమెరికా అధ్యక్షులందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.అణుదాడి జరిగిన వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రదేశానికి తరలిస్తారు. సురక్షిత ప్రాంతానికి క్షణాల్లో చేరుకునేందుకు అధ్యక్షుడికి అనేక మార్గాలు సిద్ధంగా ఉంటాయి.అందులో ఒక బంకర్ వైట్‌హౌజ్‌ కిందే ఉంటుంది. ఎలాంటి దాడినైనా తట్టుకునేలా దీన్ని 1950లో నిర్మించారు.మరొకటి వర్జీనియాలోని బ్లూ రిడ్జ్ పర్వతాల్లో ఉంది. ఇక్కడికి వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. ఫ్లోరిడాలోని మార్-లా-లగో ఎస్టేట్‌లో మరొక బంకర్ ఉంది.ఇంకోటి వెస్ట్ పామ్ బీచ్‌లో అధ్యక్షుడి గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఉంది.దీన్ని బాంబులు నిల్వ చేసేందుకు ఉపయోగించేవాళ్లు.బాంబు షెల్టర్లను చూస్తే అణు భయాలు తలెత్తిన ప్రతీసారీ అధ్యక్షుడిని కాపాడుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అర్ధం అవుతుంది.అణు యుద్ధం అనేది కొందరికి ఊహకందని విషయం. మరికొందరు మాత్రం దాని గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. అయితే, నేరుగా అణుదాడి చేస్తే ఏ ఒక్క బంకర్‌ కూడా దాన్ని నుంచి తప్పించుకోలేదు.

Nuclear Bomb Blast,Trump,Trump's Iran Nuclear Deal

‘అణు దాడి, దాని నుంచి వెలువడే వేడి నుంచి తట్టుకోగలిగిన రక్షణ ఈ బంకర్లకు లేదు’ అని వన్ నేషన్ అండర్‌గ్రౌండ్: ద ఫాలౌట్ షెల్టర్ ఇన్ అమెరికన్ కల్చర్ రచయిత కెన్నీత్ రోస్ అన్నారు.ఒకవేళ తొలిదాడి నుంచి అధ్యక్షుడు బతికి బయటపడితే, అప్పుడు అతడిని సురక్షితమైన బంకర్‌లోకి తరలిస్తారు.ప్రపంచం మొత్తం తగలబడిపోతున్నా.. దేశాన్ని పాలించేందుకు అనువైన అన్ని వసతులు ఆ బంకర్‌లో ఉండాలి.అందుకే అమెరికా అధికారులు సురక్షిత ప్రాంతంలో అధ్యక్షుడి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.బంకర్‌లోకి వెళ్లేందుకు అత్యున్నత అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని 9/11 దాడి సమయంలో వైట్‌హౌజ్‌ బంకర్‌లో పనిచేసిన రాబర్ట్ డార్లింగ్ చెప్పారు.’బంకర్‌లోకి వెళ్లాలంటే చైన్ ఆఫ్ కమాండ్ ఉండాలి’ లేదంటే పరిస్థితి అంతా గందరగోళంగా మారుతుందట.

అమెరికాలోని సాధారణ ప్రజలు సైతం తమ సొంత ఖర్చులతో బంకర్లను నిర్మించుకుంటారట.అంతేకాదు దేశ ప్రజానికానికి మొత్తానికి సామూహిక ఫాలౌట్ షెల్టర్లను ఏర్పాటుచేయాలనే తలంపుతో ఉందట అమెరికా..అందులో భాగంగానే 1964లోనే కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో సామూహిక బంకర్లను ఏర్పాటు చేసింది.అగ్రరాజ్యమా మజాకానా…