Disadvantages of big age gap between partners

కేవలం భారతదేశం అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, జనరల్ గానైతే మగవారు వయసులో పెద్దగా, ఆడవారు వయసులో చిన్నగా ఉండే జంటలనే చూస్తుంటాం. కాని కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయి కదా. ఇప్పుడు అలాంటి పట్టింపులకి పోవట్లేదు యువత. అమ్మాయి వయసులో పెద్దది అయినా సరే, మనసుకి నచ్చితే మనువాడుతున్నారు. అలాగే అబ్బాయి తమ కన్నా చిన్నవాడు అయినా సరే, చిన్నగా చూడకుండా కనెక్ట్ అవుతున్నారు. ఇది బానే ఉంది. వయసులో ఎవరు పెద్ద అనేది పెద్ద విషయం కాదు, కాని ఎంత తేడా అనేది మాత్రం గమనించాల్సిన విషయమే. ఎందుకంటే భాగస్వాముల మధ్య తేడా ఎక్కువ ఉంటే, ఇదిగోండి ఇలాంటి సమస్యలు ఎదురుకావోచ్చు.

* ఆలోచనలో తేడా :

19-20 ఏళ్ల వయసుకి, 23-24 ఏళ్ల వయసుకి పెద్ద తేడా ఏమి కనిపించకపోవచ్చు, కాని ఆలోచనల్లో చాలా తేడాలు ఉంటాయి. ఓసారి మీరే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి, టీనేజ్ చివర్లో మీ ఆలోచనలు ఎలా ఉండేవో, అవి ఇప్పుడు గుర్తుకు వస్తే మీరు ఎంత సిల్లిగా ఫీల్ అవుతారో. అందుకే, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, 23-24 ఏళ్ళు వచ్చే దాకా పెళ్ళి గురించి ఆలోచించకపోవడమే మంచిది.

* ఇంటరెస్ట్ లో తేడాలు :

5-6 ఏళ్ల గ్యాప్ ఉన్నాసరే, ఇంటరెస్ట్ లో తేడాలు ఉంటాయి. ఒకరికి నచ్చే విషయాలు మరొకరికి నచ్చకపోవచ్చు. ఇలాంటి తేడాలలో సరదాగా చిన్న చిన్న గొడవలు జరిగితే చిలిపిగానే ఉంటాయి కాని, అవి పెద్దగా ఉంటేనే సమస్య.

* శృంగార జీవితంలో సమస్యలు :

కొందరు భాగస్వాముల మధ్య 10 సంవత్సరాల తేడా కూడా ఉంటుంది. అది నిజంగా టూ మచ్. శృంగార జీవితంలో ఇలాంటి దంపతులు సమస్యలు ఎదురుకోవచ్చు. ఎందుకంటే వయసు ఎక్కువ ఉన్న పార్టనర్ మీద వయసు తక్కువ ఉన్న పార్టనర్ కి త్వరగానే ఆసక్తి తగ్గిపోవచ్చు.

* నిర్ణయాల్లో తేడాలు :

దంపతులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే, ఇద్దరు నిర్ణయాలు కలవాలి. ఇద్దరు ఒకేమాట మీద నిలబడాలి. అప్పుడే ఎలాంటి చిక్కులు ఉండవు. కాని వయసులో పెద్ద తేడా ఉంటే నిర్ణయాల్లో చాలా తేడాలు ఉంటాయి. ఇద్దరు ఒకే నిర్ణయం మీద నిలబడటం చాలా కష్టమైన విషయం.

* అడ్జస్ట్ మెంట్స్ తక్కువ :

ఒకటి రెండు సంవత్సరాల తేడా ఉన్నవారైతే ఒకే విధంగా ఆలోచిస్తారు కాబట్టి తమ భాగస్వామిని బాగా అర్థం చేసుకుంటారు. ఒక్కోసారి తప్పు తమది కాకపోయినా అడ్జస్ట్ అయిపోతారు. కాని వయసులో తేడా ఎక్కువ ఉంటే టెంపరమెంట్ తక్కువ ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.