Director’s age is 43 and his new girlfriend is just 22

బాలివుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఏం చేసిన సంచలనమే. ఎవరు తిట్టుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా, తనకి నచ్చిందే మాత్రమే చేస్తాడు ఈ డేరింగ్ డైరెక్టర్. సినిమాల్లో ప్రతి సీన్ కి ఓ బండబూతు రాస్తాడు. అదో స్టయిల్. ఎవరు ఊహించలేని విధంగా హింసాత్మక సీన్లు, శృంగార సీన్లు తీస్తాడు, చివరకి లెస్బియన్ కిస్సింగ్ సీన్లు కూడా పెడతాడు. అంతా తన ఇష్టం, చూస్తే చూడండి, లేదంటే మానేయ్యండి అంటాడు. అందుకే బాలివుడ్ లో అనురాగ్ ని జూనియర్ రామ్ గోపాల్ వర్మ అని అంటారు. ఇప్పుడు ఈ జూనియర్ ఆర్జీవి ఏం చేసాడో తెలుసా? కొత్త గర్ల్ ఫ్రెండ్ ని పట్టుకున్నాడు. అది కూడా తనకన్నా, 21 ఏళ్ళు తక్కువున్న అమ్మాయిని.

అనురాగ్ వయసు 43. తన కొత్త గర్ల్ ఫ్రెండ్ వయసు 22. చిత్రమైన విషయం ఏమిటంటే అనురాగ్ కి 16 ఏళ్ళ కూతురు ఉంది. ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ పేరు శుభ్ర షెట్టి. తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు తానే స్వయంగా పోస్ట్ చేస్తున్నాడు అనురాగ్. సెల్ఫీల నుంచి బెడ్ రూమ్ ముచ్చట్ల వరకు, అన్ని సోషల్ మీడియాలో పెడుతోంది ఈ జంట. వీరు గనుక పెళ్ళి చేసుకుంటే ఇది అనురాగ్ కి మూడొవ పెళ్ళి అవుతుంది.

2003లో ఆర్తి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోని ఓ కూతురిని కన్న అనురాగ్, ఆమెకి విడాకులు ఇచ్చి 2011లో బాలివుడ్ హీరోయిన్ కల్కీ కొచ్చిన్ ని పెళ్ళాడాడు. నాలుగేళ్ళ తరువాత ఈ జంట కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడు చిన్న గ్యాప్ తరువాత ఇలా ఎవరు ఊహించని విధంగా చాలా అంటే చాఆ యంగ్ గర్ల్ ఫ్రెండ్ ని మేయింటేన్ చేస్తున్నాడు అనురాగ్.