మన దగ్గర దమ్ము లేనప్పుడు రివ్యూవర్స్‌ను విమర్శించి ఏం లాభం?     2018-07-03   00:45:27  IST  Raghu V

‘పెళ్లి చూపులు’ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను, విమర్శకుల ప్రశంసలను, అవార్డులను అందుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చాలా గ్యాప్‌ తీసుకుని తన రెండవ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ఆ చిత్రం తాజాగా విడుదలైంది. సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో దర్శకుడు తరుణ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో రివ్యూవర్స్‌ సినిమాను చీల్చి చెండాడారు. రేటింగ్‌ చాలా తక్కువగా ఇవ్వడంతో ఓవర్సీస్‌ కలెక్షన్స్‌పై ప్రభావం పడటం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రంకు నెగటివ్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో భారీగా వసూళ్లు నమోదు అవుతాయని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు నిరాశే మిగిలింది. ఆ నిరాశతో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ అతిగా స్పందిస్తూ ఉన్నాడు. సోషల్‌ మీడియాలో పలువురు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నుండి బయటకు వచ్చేశాడు. తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్‌ చేసుకున్నాడు. ఇక రివ్యూవర్స్‌పై కూడా తీవ్ర స్థాయిలో ఈయన వ్యాఖ్యలు చేశాడు.