భారతీయుడు 2 కు ఇలా హైప్‌ తీసుకు వస్తున్న శంకర్‌  

సౌత్‌ సినీ పరిశ్రమ దిగ్గజ దర్శకుడు శంకర్‌ ఇటీవలే రజినీకాంత్‌ హీరోగా ‘2.0’ చిత్రాన్ని ప్రేక్షకుల తెరకెక్కించాడు. గత సంవత్సర కాలంగా ఆ చిత్రం అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రంను విడుదల తేదీని ఫిక్స్‌ చేశారు. భారీ అంచనాల నడుమ హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కిన ఆ చిత్రాన్ని విడుదల చేయక ముందే శంకర్‌ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న భారతీయుడు సీక్వెల్‌కు సన్నాహాలు పూర్తి అయ్యాయి.

కమల్‌ హాసన్‌ హీరోగా చాలా సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో భారతీయుడు సినిమా జాతీయ స్థాయిలో ప్రేక్షకుల అభిమానంను దక్కించుకుంది. అంతటి విజయాన్ని దక్కించుకున్న భారతీయుడు చిత్రంను సీక్వెల్‌ చేయాలని చాలా కాలంగా కమల్‌ అనుకుంటున్నాడు. ఇన్నాళ్లకు శంకర్‌ అందుకు సిద్దం అయ్యాడు. ఈమద్య కాలంలో కమల్‌ చేసిన ప్రతి సినిమా కూడా బాలీవుడ్‌కు వెళ్తుంది. అందుకే ఈ చిత్రంను కూడా బాలీవుడ్‌కు భారీ ఎత్తున తీసుకు వెళ్లేందుకు ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడిని నటింపజేయాలని నిర్ణయించాడు.

రజినీకాంత్‌తో చేసిన 2.0 చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ను నటింపజేసి, బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు శంకర్‌ ఇప్పుడు భారతీయుడు సీక్వెల్‌ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ను నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. అజయ్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తాడా లేందంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అజయ్‌ దేవగన్‌ నటించడం వల్ల ఈ చిత్రం స్థాయి అమాంతం పెరగడం ఖాయం.

బాలీవుడ్‌లో భారీ ఎత్తున మార్కెట్‌ కావడం కోసం ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ను ఎంపిక చేశాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో భారతీయుడు సీక్వెల్‌ చిత్రం ఇండియన్‌ను తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. శంకర్‌ స్థాయికి ఈ బడ్జెట్‌ మామూలే. సినిమా ప్రారంభం అయిన తర్వాత ఈ బడ్జెట్‌ డబుల్‌ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ తమిళ సినీ పండితులు చెబుతున్నారు. వచ్చే ఏడాది చివరి వరకు సినిమా వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.