మళ్లీ పీకల్లోతు కష్టాల్లో పూరి     2018-05-08   01:39:02  IST  Raghu V

సినిమా పరిశ్రమలో ఒడుదుడుకులు చాలా సహజం. అయితే గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితి విభిన్నం అని చెప్పుకోవాలి. గతంలో అనుభవం లేకపోవడం మరియు అవగాహణ లేకపోవడం, ముందు చూపు లేకపోవడం వల్ల ఎంతో మంది స్టార్స్‌ డబ్బును దాచుకోవడం, దాన్ని ఆస్తిగా మ్చుకోవడంలో విఫం అయ్యారు. అందుకే కెరీర్‌ మంచి జోరుగా ఉన్న సమయంలో స్టార్స్‌గా ఉన్న వారు ఆ తర్వాత అవకాశాు లేని సమయంలో జీరోలుగా మిగిలిపోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. ఇప్పుడు నాలుగు ఆఫర్లు రాగానే వచ్చిన డబ్బును సరైన మార్గంలో పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అయితే పూరి మాత్రం ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా కాకుండా పాతపద్దతిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పూరి కెరీర్‌ ఆరంభంలో మంచి సినిమాలు చేయడంతో భారీగా పారితోషికం దక్కి, అద్బుతమైన ఫామ్‌తో అందరి దృష్టి ఆకర్షించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఎవరో మోసం చేయడం వల్ల పూరి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ ఇబ్బందుల నుండి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత బయట పడ్డాడు. వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇలాంటి సమయంలోనే మళ్లీ పూరి చేస్తున్న పని వల్ల ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దర్శకుడు తన స్థాయి మరియు మార్కెట్‌ను బట్టి సినిమా తీయాలి. అలా కాదని ఎక్కువ బడ్జెట్‌తో సినిమా తీస్తే నిర్మాత కొంప కొల్లేరు అవ్వడం ఖాయం. ఇప్పుడు అదే అవుతుంది.