తేజా కావాలన్నాడు, క్రిష్‌కు అక్కర్లేదనుకుంటా!     2018-06-12   00:44:16  IST  Raghu V

ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హరికృష్ణ ఆయన రధ సారధిగా వ్యవహరించారు. అందుకే ఆయన పాత్రను కళ్యాణ్‌ రామ్‌తో చేయించాలని తేజ భావించాడు. తాత సినిమాలో తండ్రి పాత్ర అంటే వద్దనుకుంటాడా, వెంటనే సరే అనేశాడు. కాని సినిమా చేతులు మారిన తర్వాత పరిస్థితి కూడా తారుమారు అయినట్లుగా అనిపిస్తుంది. క్రిష్‌ ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్‌తో చేయించాలని భావించడం లేదు. ఆయన ఆలోచన ప్రకారం కొత్త వారితోనే హరికృష్ణ పాత్ర చేయించడం వల్ల బాలకృష్ణ పాత్రకు వెయిట్‌ ఎక్కువ దక్కుతుందనే ఆశ ఆయనలో కలుగుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఎన్టీఆర్‌ సినిమా కోసం ప్రయోగాలు చేయవద్దని ఆయన భావిస్తున్నాడు.

తాజాగా కళ్యాణ్‌ రామ్‌ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ.. తాత చిత్రం కోసం గతంలో తేజ నన్ను రెండు మూడు సార్లు సంప్రదించాడు. కాని క్రిష్‌ నుండి ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు రాలేదు. అందుకే క్రిష్‌ చేస్తున్న ఈ చిత్రంలో తాను అక్కర్లేదేమో అనుకుంటున్నాను అన్నాడు. ఒకవేళ క్రిష్‌ నుండి లేదా బాబాయి నుండి కాల్‌ వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ కళ్యాణ్‌ రామ్‌ చెప్పుకొచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి.