సంపాదించినదంతా పోగొట్టుకుంటున్న దిల్ రాజు  

బడా నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది భారీ హిట్స్ సాధించారు. ఫిదా వరకు అయన పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా, నిర్మించిన ప్రతి సినిమా, డిస్ట్రీబ్యూట్ చేసిన సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడేసాయి. సంవత్సరం మొదట్లోనే శతమానంభవతి వంటి భారీ సక్సెస్ ని ఖతాలో వేసుకున్న దిల్ రాజు, ఆ తరువాత నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్ ని కొట్టారు. ఇక ఫిదా మరొక ఎత్తు. వరల్డ్ వైడ్ గా 47-48 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. కేవలం నైజాంలోనే 18 కోట్లకు పైగా వసూలు చేయడం మామూలు విషయం కాదు‌. ఎందుకంటే ఖైదీనం 150, జనతా గ్యారేజ్ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్స్ నైజాంలో ఇంచుమించుగా అదే వసూళ్ళు రాబట్టాయి.

ఇన్నేసి బ్లాక్ బస్టర్స్ తో సంపాదించినదంతా స్పైడర్, జైలవకుశ సినిమాల మీద పెట్టేసారు దిల్ రాజు. స్పైడర్ ని నైజాంలో 24-25 కోట్లకు, ఉత్తరాంధ్ర లో 8-9 కోట్లకు కొనేసారు దిల్ రాజు. అలాగే జైలవకుశ మీద నైజాంలో 18-20 కోట్లు పెట్టేసారు. అంటే రెండు సినిమాల మీద 50 కోట్లకు పైగానే పెట్టారన్నమాట. స్పైడర్ భారీ నష్టాల వైపు సాగుతోంది. మరోవైపు జైలవకుశ కూడా చిన్నిపాటి నష్టాల్నే తీసుకువచ్చేలా ఉంది.

ఇలా కష్టపడి సంపాదించినదంతా కొన్నిరోజుల్లోనే పోగొట్టుకోబోతున్నారు దిల్ రాజు. సినిమా ప్రపంచంలో డబ్బుతో ఆటలు ఇలానే ఉంటాయి. ఎప్పుడు చేతిలో డబ్బు ఉండేది చెప్పలేం, ఎప్పుడు పోయేది చెప్పలేం. శుక్రవారం నుంచి శుక్రవారం జాతకాలు మారిపోతూ ఉంటాయి.