కృష్ణుడంటే భయపడుతున్న దిల్ రాజు  

సినిమారంగంలో ఉండే సెంటిమెంట్ల గురించి కొత్తగా చెప్పేదేముంది. ఓ సినిమా హిట్ అయితే దానికి వాడిన చాలా విషయాలని రిపీట్ చేయాలి అనుకుంటారు. అన్ని వర్కవుట్ కావు. ఠాగూర్ బ్లాక్బస్టర్ అయ్యిందని, టైటిల్ చివర్లో “ర్’ వచ్చేలా మూడు అక్షరాల పేర్లతో సినిమాలు తీయడం మొదలుపెట్టారు నిర్మాత ఠాగూర్ మధు. సందీప్ కిషన్ “టైగర్”, వరుణ్ తేజ్ ” మిస్టర్”, సాయిధరమ్ తేజ్ “విన్నర్” .. ఇక బడా బాబు మహేష్ బాబుతో తీసిన “స్పైడర్” అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి.

ఒకప్పుడు మహేష్ బాబు కూడా మూడు అక్షరాల టైటిల్స్ కలిసొస్తున్నాయని పదే పదే మూడు అక్షరాల టైటిల్స్ వాడాడు. కాని ప్రతీసారి మురారి, ఒక్కడు, పోకిరి, అతడు లాంటి సినిమాలే రావు కదా, అతిథి, ఖలేజా, ఆగడు, స్పైడర్ లాంటి సినిమాలు కూడా తగులుతుంటాయి. కాబట్టి టైటిల్ సెంటిమెంట్ అనేది పనికిరాదు. కాని చిత్రంగా ఇలాంటి సెంటిమెంట్ ని అగ్రనిర్మాత దిల్ రాజు కూడా పట్టించుకోవడం విచిత్రం.