దిల్‌రాజు ఆ దర్శకుడిని బుట్టలో వేసుకున్నాడు     2018-06-30   03:29:46  IST  Raghu V

దిల్‌రాజు సినిమా నిర్మించాడు అంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్‌ ఉంటుందని అంతా నమ్ముతారు. సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఇలా అంతా కూడా దిల్‌రాజు సినిమా వస్తుందంటే నమ్మకం పెట్టుకుంటారు. సక్సెస్‌ దర్శకులను, ట్యాలెంట్‌ ఉన్న దర్శకులను దిల్‌రాజు ఎప్పుడు వదులుకోడు అనే విషయం తెల్సిందే. తాజాగా మరోసారి దిల్‌రాజు తన తెలివిని ఉపయోగించాడు. ఈమద్య తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘సమ్మోహనం’.

సుధీర్‌బాబు హీరోగా అదితి రావు హీరోయిన్‌గా రూపొందిన ఆ చిత్రం కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. సుదీర్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా ఆ చిత్రం నిలిచింది. అందుకే ఆ దర్శకుడితో ఏకంగా చిరంజీవి మరియు మహేష్‌బాఋ కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ విషయాన్ని స్వయంగా వారే దర్శకుడితో చెప్పుకొచ్చారు. దాంతో ఆ దర్శకుడిపై దిల్‌రాజు కన్ను వేశాడు. ఇంద్రగంటి తర్వాత చిత్రాన్ని తాను నిర్మించాలని దిల్‌రాజు ఆశ పడుతున్నాడు. ఇప్పటికే ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకుని హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్న దర్శకుడు ఇంద్రగంటిని దిల్‌రాజు సంప్రదించడం జరిగింది.