వివాహాలు ఎన్ని రకాలో తెలుసా? Devotional Bhakthi Songs Programs     2017-10-01   22:14:44  IST  Raghu V

Different Types of Indian Weddings

వివాహాలు ఎన్ని రకాలు అని అడిగితె ఎవరు సమాధానం వేంటనే చెప్పలేరు. ప్రాంతాన్ని బట్టి అక్కడి ఆచార వ్యవహారాలను బట్టి వివాహాలు భిన్నమైన రీతిలో జరుగుతూ ఉంటాయి. అయితే ఏ వివాహం అయినా ఇప్పుడు చెప్పే 8 రకాల వివాహాల్లో ఎదో ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. బ్రహ్మం – ఈ వివాహంలో వరుణ్ణి ఎంపిక చేసుకొని, తన కూతురుని వివాహం చేసుకోమని అడిగి చేసే వివాహం బ్రహ్మ వివాహం.

2. దైవం – యజ్ఞ యాగాదులు చేసే రుత్విజునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం దైవ వివాహం.

3. అర్షం – ఒకప్పుడు గో సంపదను చూసి వివాహం చేసేవారు. అలాంటి రెండు గోవులను స్వీకరించి తన కుమార్తెకు వివాహం చేయటం అర్ష వివాహం.