Differences between Brown rice and White rice … which one is better ?

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రెండు పూటలా తినేది బియ్యాన్నే. కాని ఒకేరకైమైన బియ్యాన్ని. అదే వైట్ రైస్. అంటే పాలిష్ చేసిన రైస్. రెండు మూడు సార్లు పాలీష్ చేసిన తెల్లబియ్యాన్ని తింటున్నాం మనం. బ్రౌన్ రైస్ తినడం ఎప్పుడో మానేసాం. అసలు బ్రౌన్ రైస్ అంటూ ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. ఆర్గానిక్ అయిన బ్రౌన్ రైస్ ఖరీదు మనం తినే తెల్ల బియ్యం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ఉంటుంది. విచిత్రం కదా. బ్రౌన్ రైస్ నుంచే వైట్ రైస్ వస్తుంది. కాని బ్రౌన్ రైస్ ఖరీదే ఎక్కువ. ఈ రెండిట్లో ఏది తినాలి, ఏది మన ఆరోగ్యానికి మంచిది అంటే ఈజీగా బ్రౌన్ రైస్ అని చెప్పొచ్చు. కాని బ్రౌన్ రైస్ వైట్ రైస్ కన్నా ఎందుకు మంచిది ? రెండిటి మధ్య తేడాలు ఏమిటి ?

* మనం అన్నం తినగానే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బియ్యంలో కాలరీలు ఎక్కువ ఉంటాయి. 1 కప్పు వండిన తెల్ల బియ్యంలో 242 కాలరీలు ఉంటే, అదే ఒక కప్పు బ్రౌన్ రైస్ వండితే 218 కాలరీలు దొరుకుతాయి. కాబట్టి కాలరీలు కరిగేలా కష్టపడుతున్నవారే వైట్ రైస్ తింటే పర్లేదు. కాని ఒకే చోట కూర్చొని పనిచేసేవారు తెల్లబియ్యంతో సులువుగా బరువు పెరిగిపోతారు.

* కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, ఫైబర్ తక్కువ తీసుకోవాలి. అప్పుడు మన రక్తం బాగుంటుంది, ఓవరాల్ గా శరీరం బాగుంటుంది. ఒక బ్రౌన్ రైస్ లో 46 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటే, 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే వైట్ రైస్ అంతే పరిమాణంలో తీసుకుంటే 53 గ్రాముల కార్బోహైడ్రేట్స్, కేవలం 1 గ్రామ్ ఫైబర్ ఉంటుంది.