నిస్తేజంగా మారిన చర్మం ప్రకాశవంతంగా మారాలంటే....బెస్ట్ ఆహారాలు     2018-05-28   00:01:15  IST  Lakshmi P

చర్మం నిస్తేజంగా,డల్ గా ఉంటే కాస్త చికాకుగానే ఉంటుంది. చర్మం ప్రకాశవంతంగా మారటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం . దానికి కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయిన రెడీ అయ్యిపోతు ఉంటాం. అయితే మనకు అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలను తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారటమే కాకుండా ముడతలు.వయస్సు రీత్యా వచ్చే సమస్యలు అన్ని తగ్గిపోతాయి. ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ A, విటమిన్ C సమృద్ధిగా ఉండుట వలన చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మానికి రక్షణను ఇస్తుంది. బ్రోకలీలో ఉండే విటమిన్ A UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో విటమిన్లు A, E లు ఉండుట వలన చర్మంపై మేజిక్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది చర్మాన్ని తేమగా,మృదువుగా ఉంచటానికి సహాయపడుతుంది.అంతేకాక చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది.