కేసీఆర్ కి భారతరత్న కోసం డిమాండ్..  

తెలుగునాట ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చంద్రబాబు ఎప్పటి నుంచో మొదలుపెట్టారు..ఆ దిశగా అనేకసార్లు కేంద్రానికి నివేదించారు..మహానాడు జరిగిన ప్రతీసారి పార్టీలో ఇదే విషయంపై తీర్మానం కూడా చేస్తూ ఉంటారు..అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక మొదటిసారిగా తెలంగాణా నుంచీ కూడా భారతరత్న డిమాండ్ ఒకటి వస్తోంది..అది ఎన్టీఆర్ కోసం కాదు..తెలంగాణా రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న కేసీఆర్ కోసం..మీరు విన్నది నిజమే..ఈ కొత్త డిమాండ్ ఎవరి కోసమో కాదు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం.