ఈబీ-5 వీసాలకు పెరుగుతున్న డిమాండ్     2018-05-16   06:15:41  IST  Bhanu C

అమెరికా ప్రభుత్వం వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్‌- 1 వీసాలపై తీసుకున్న ఖటినమైన నిర్ణయం అందరికీ తెలిసిందే అదే విధంగా హెచ్ -4 స్పౌస్ వీసాలు కూడా రాదు చేయనున్న నేపద్యంలో..ఇప్పుడు “ఈబీ-5” వీసాలకు డిమాండ్‌ పెరుగుతోంది. 2016 అక్టోబర్‌ 2017 మధ్య కాలంలో ఈ వీసాలని దాదాపుగా 174 వీసాలు జారీ చేసినట్టు తెలుస్తోంది…అయితే ఇదే వీసాలు గత ఏడాది 149 మాత్రమే జారీ కావడంతో ఇప్పుడు అందరూ ఈ ఈబీ -5 కి డిమాండ్ పెరుగుతోందని తెలుస్తోంది..

అయితే ఈ వీసాలనే “క్యాష్‌ ఫర్‌” వీసాగా వ్యవహరిస్తారు…దీంట్లో అమెరికాలో స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవాలి. (పౌరసత్వంకోసం కాదు). దీనిలో భాగంగా అమెరికాలో కనీసం పది లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టి ఒక సంస్థను నెలకొల్పడంతో పాటు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. వీసా జారీ అయితే దరఖాస్తుదారునితో పాటు వారి జీవిత భాగస్వామి..21 సంవత్సరాల్లోపు పిల్లలు కూడా అమెరికాలో నివాసముండే సౌలభ్యం కలుగుతుంది.