బిగ్ బాస్ హౌస్ లోనే కాదు...బయటకూడా కాస్ట్, లోకల్ ఫీలింగ్ తో ప్రచార పోటీ..!    2018-06-30   22:21:22  IST  Raghu V

మీది తెనాలి మాది తెనాలి అనే డైలాగ్ ఇంద్ర సినిమాలో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు మన బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్. మీది బెజవాడే మాది బెజవాడే టైపులో పాపం, హౌజులో అక్కా, తమ్మీ అనుకుంటూ సహకరించేసుకుంటున్నారు కూడా… కానీ ఇప్పుడు ఓ రెడ్డి అమ్మాయి, అదీ తెలంగాణ అమ్మాయికి అనుకూలంగా హైదరాబాదులో సపోర్ట్ ఫ్లెక్సీలు వెలుస్తున్నయ్.

ఇంస్టాగ్రామ్ ,డబ్ స్మాష్ ..ల ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ షో కి ఎంపిక అయినా ‘ దీప్తి సునైనా’ బాగానే పాపులర్ అయ్యింది. అంతే కాదు అటు బిగ్ బాస్ షో లో కూడా అదరగొడుతుంది.. ఇది లా ఉండగా ఈ సారి బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ ఎంపిక మీద తీవ్ర విమర్శలు వెల్లువ ఎత్తాయి .. ఎందుకు అంటే ఎక్కువ శాతం ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినవారిని ఎంపిక చేసారు అనే విమర్శలు ఎక్కువ అయ్యాయి … బెజవాడ లోని ఒక అభిమాని ఎలాంటి బ్యానర్ వేయించాడో తెలుసా ?