మృత కణాలను(డెడ్ స్కిన్ ) వదిలించుకోవడానికి అద్భుతమైన పాక్స్  

చర్మంపై మృత కణాలు అనేవి తక్కువ పరిశుభ్రత, అధిక సెబామ్ వంటి కారణాలతో వస్తూ ఉంటాయి. ఇలా చర్మంపై మృత కణాలు పేరుకపోతే మొటిమలు,బ్రేక్ ఔట్స్ వంటి సమస్యలు అధికంగా వస్తాయి. మృత కణాలను తొలగించుకోవడానికి కొన్ని పాక్స్ ఉన్నాయి. వీటికి అవసరమైన అన్ని పదార్ధాలు మనకు ఇంటిలో సులభంగా దొరుకుతాయి. ఈ పాక్స్ తయారుచేసుకోవడం కూడా సులువే. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఉడికించిన ఓట్ మీల్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మృత కణాలు తొలగిపోతాయి.

మూడు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో ఒక స్పూన్ పంచదార కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మృత కణాలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ కోకో పొడిలో ఒక స్పూన్ రోజ్ వాటర్,అరస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మృత కణాలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసి కొంచెం ఆరాక స్క్రబ్బింగ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మృతకణాలు తొలగిపోయి మొటిమల సమస్య తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.