కానిస్టేబుల్ కూతురిపై..డీసీపీ అత్యాచారం....     2018-06-28   05:55:10  IST  Raghu V

ఇలాంటి వార్తలు చదివినప్పుడు అత్యాచారాలు చేసే వెధవలకి కాస్త ధైర్యం వస్తుంది…ఒక ఉన్నత స్థాయి అధికారి చేయగా లేనిది మనం చేస్తే తప్పు ఏంటి అని..నేరాలు చేసేవారిని లాటీ తో కాళ్ళు విరిగేలా కొట్టి మళ్ళీ తప్పు చేయకుండా బుద్ది చెప్పే స్థాయిలో ఉన్న డీసీపీ స్థాయి పోలీసు ఉన్నత అధికారి సాటి మహిళా కానిస్టేబుల్ కూతురిపై కన్నేశాడు ఆపై ఇంతకి పిలిచి అత్యాచారం చేశాడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఇప్పటికే దేశంలో ఎంతో మంది బరితెగించి అత్యాచారం చేస్తూ బరితెగించి పోతుంటే..ఇప్పుడు సదరు పోలీస్ బాస్ చేసిన ఘటనతో పోలీసుల పరువు మొత్తం పోయింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది…ఏపీఎఫ్ (ఔరంగాబాద్ పోలీస్ ఫోర్స్)లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్దం అవుతోంది ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కుమార్తెను చూసిన ఔరంగాబాద్ జోన్-2 డీసీపీ రాహుల్ శ్రీరామే ఆమెపై ని ఎలాయినా పొందాలని అనుకున్నాడు ఎంపీఎస్సీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో నీ కుమార్తెకు నేను చెబుతాను…నీ కుమార్తె పాస్ అయ్యేలా చేసే భాద్యత నాది అంటూ నమ్మించి తన ఇంటికి పిలిపించుకున్నాడు